కానాజీగూడలో బస్తీ దవాఖానా ఫ్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

కానాజీగూడలో బస్తీ దవాఖానా ఫ్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  •     ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
     

అల్వాల్, వెలుగు:  అల్వాల్ సర్కిల్ పరిధి వెంకటాపురం డివిజన్​లోని కానాజీగూడలో కొత్తగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. అనంతరం అక్కడ ఆయన మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్ ఆనంద్, కార్పొరేటర్ సబిత, డీపీవో మంజుల, అల్వాల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ డాక్టర్ ప్రసన్న పాల్గొన్నారు.