పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే మట్టా రాగమయి

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే మట్టా రాగమయి

వేంసూర్, వెలుగు  నకిలీ విత్తనాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. వేంసూర్ మండలం కందుకూరు, భరణిపాడు గ్రామాల్లో 3 వేల ఎకరాల్లో 90 రోజులకే వరి పంట పొట్ట దశకు వచ్చి తాలుగా మారింది.  నష్టపోయిన వరి పంటను సోమవారం వ్యవసాయ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వరుణ్ అగ్రిటెక్ సంస్థతో మాట్లాడి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంట నష్టం వివరాలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట నాయకులు, అధికారులు, 
రైతులు ఉన్నారు. 

లక్ష్యాన్ని చేరేవరకు ముందుకు సాగాలి

తల్లాడ, వెలుగు : స్టూడెంట్స్ అనుకున్న లక్ష్యాన్ని చేరేవరకు ముందుకు సాగాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి సూచించారు. సోమవారం తల్లాడ ఆర్​బీ గార్డెన్ లో ఇన్​స్పెర్​అండ్ ఇగ్నిటీ ఆధ్వర్యంలో జరిగిన మోటివేషన్ క్లాసులకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.