సింగరేణి కార్మికులకు బోనస్పై హర్షం : ఎమ్మెల్యే మట్టా రాగమయి

సింగరేణి కార్మికులకు బోనస్పై హర్షం : ఎమ్మెల్యే మట్టా రాగమయి

సత్తుపల్లి, వెలుగు: సింగరేణి కార్మికులకు బోనస్​ప్రకటించడంపై ఎమ్మెల్యే మట్టా రాగమయి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సత్తుపల్లి జేవీఆర్ ఓసీ ప్రాజెక్టు కార్యాలయ ఆవరణలో తన భర్త దయానంద్, సింగరేణి కార్మికులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సింగరేణి కార్మికులు ఎమ్మెల్యే దంపతులను సత్కరించారు. ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నారావు, బత్తుల భWరత్, మల్లూరు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.