ప్రభుత్వంపై హరీశ్ అనవసర విమర్శలు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

ప్రభుత్వంపై హరీశ్ అనవసర విమర్శలు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 
  •  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్

హైదరాబాద్, వెలుగు: ఏపీ మంత్రి నారా లోకేష్ మాటలను బూచిగా చూపుతూ హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరమైన విమర్శలు చేస్తున్నరని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. శనివారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ మాట్లాడినంత మాత్రాన హరీశ్ రావు అంత హడావుడి చేయాల్సిన అవసరం లేదని, బనకచర్లను అడ్డుకొని తీరుతామని ఆయన పొంకనాలు కొడుతున్నారని, అంత కష్టం హరీశ్ కు అవసరం లేదని, దాన్ని తమ ప్రభుత్వం ఆపి తీరుతుందని చెప్పారు.

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని, అనుమతులు లేకుండా లోకేష్  బనకచర్లను ఎలా కడుతాడో తాము చూస్తామన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకే బీఆర్‌‌‌‌ఎస్ ఉందన్న హరీశ్, మరి లోకేష్ ను కేటీఆర్ ఎందుకు కలిశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేదనే కారణంతో కేసీఆర్ ను జనం ఫామ్ హౌస్ కు పంపించారని వివరించారు.