యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, వెలుగు: పంటలకు అవసరమైన యూరియా సరఫరా చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  అన్నారు. గంగాధర మండలం కురిక్యాల పీఏసీఎస్​ వద్ద  యూరియా కోసం ఎదురుచూస్తున్న  రైతులతో మాట్లాడారు. యూరియాకు ఇబ్బంది లేకుండా చూస్తామని రైతులకు భరోసా కల్పించారు. నిర్వాహకులతో మాట్లాడి  సొసైటీకి వచ్చిన యూరియా, రైతులకు పంపిణీ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. 

చొప్పదండి, వెలుగు: చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం జరగనున్న వినాయక నిమజ్జన  ఏర్పాట్లను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. 1వ వార్డులో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌‌‌‌  లైట్లను ప్రారంభించారు. మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి తల్లి మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్​ కొత్తూరు మహేశ్‌‌‌‌, వైస్​ చైర్మన్​ రాజేందర్​, కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు చందు, మాజీ కౌన్సిలర్​ అశోక్​, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగయ్యగౌడ్​, తిరుపతిగౌడ్​ పాల్గొన్నారు.