చిన్నారెడ్డిని సస్పెండ్ చేయండి..కాంగ్రెస్ హైకమాండ్ కు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు 

చిన్నారెడ్డిని సస్పెండ్ చేయండి..కాంగ్రెస్ హైకమాండ్ కు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధిష్టాన పెద్దలకు కంప్లైంట్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న చిన్నారెడ్డిపై చర్యలను తీసుకోవాలని శనివారం ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఆఫీసుల్లో ఫిర్యాదులు అందజేశారు.

చిన్నా రెడ్డికి ఎన్ని పదవులు ఇచ్చినా.. ప్రస్తుతం కేబినెట్ హోదాలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా అత్యున్నత హోదా కల్పించినా ఆయన పార్టీకి వ్యతిరేకంగానే పని చేస్తున్నారని అందులో ఆరోపించారు. చిన్నారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, వాయిస్ రికార్డులు, మీడియా క్లిప్పింగులు, కంప్లైంట్ కాపీతో అధిష్ఠానానికి అందజేశారు