రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రయార్టీ : ఎమ్మెల్యే మురళీనాయక్

రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రయార్టీ : ఎమ్మెల్యే మురళీనాయక్

కేసముద్రం, వెలుగు :  రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే మురళీనాయక్​అన్నారు. శనివారం కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్​ఫెడ్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తుందన్నారు. 

బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అనంతరం రైతు వేదికలో అధికారులతో  ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని పలు సూచనలు చేశారు. అంతకుముందు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్​కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్లు అంబటి మహేందర్​రెడ్డి, అల్లం నాగేశ్వర్​రావు, తహసీల్దార్ వివేక్, ఎంపీడీవో క్రాంతి, నాయకులు పాల్గొన్నారు. 

విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట..

కేసముద్రం, వెలుగు : విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. శనివారం మహమూద్​పట్నం శివారులోని  కేజీబీవీను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వసతిగృహం నిర్వహణ, టీచర్ల పని తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల తీరు సరిగా లేదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫోన్​లో సూచించారు.