ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన : ఎమ్మెల్యే రోహిత్

ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన : ఎమ్మెల్యే రోహిత్
  • సమస్యలు విన్న ఎమ్మెల్యే రోహిత్ 

మెదక్, వెలుగు: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదివారం తన  క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన వచ్చింది. నియోజకవర్గ పరిధి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఎమ్మెల్యే స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు.

 ఆయా సమస్యలు త్వరగా పరిష్కారించాలని సంబంధిత  అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం పనిచేస్తుందని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ  చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్  మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు  పాల్గొన్నారు.