
పాపన్నపేట, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే మైనంవల్లి రోహిత్ అన్నారు. సోమవారం ఆయన గ్రామస్తులతో కలిసి ట్రాక్టర్ మీద వెళ్లి మండల పరిధిలోని గాంధారిపల్లిలో నీట మునిగిన పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో సుమారు 40 శాతం పంటలకు నష్టం జరిగినట్లు చెప్పారు. అధికారుల సర్వే అనంతరం నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు.
కొంపల్లి గ్రామానికి చెందిన సుమారు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు ఆయన నాగ్సాన్పల్లిలో ఏడుపాయల మాజీ చైర్మన్ నర్సింలుగౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, ఆకుల శ్రీనివాస్ ప్రశాంత్ రెడ్డి, నరేందర్ గౌడ్, హఫీజ్, ప్రవీణ్, ఖలీం ఉన్నారు.