ఎస్సీ రోస్టర్ ను రివైజ్డ్ చేయాలె : వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు

ఎస్సీ రోస్టర్ ను రివైజ్డ్ చేయాలె : వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ కొత్త రోస్టర్​తో మాల ఉపకులాలకు అన్యాయం జరుగుతోందని, దీన్ని రివైజ్డ్ చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కోరారు. అసెంబ్లీ జీరో అవర్​లో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో ఎస్సీలను మూడు భాగాలు చేశారనీ, మూడో విభాగంలో మాల, దాని 26 ఉపకులాలు పెట్టారని గుర్తుచేశారు. దీంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. 

ఇటీవల రాష్ట్రస్థాయి డెంటల్ ఎగ్జామ్​లో మాల ఉపకులాల్లో ఒక్క పోస్టు రాలేదని, రాష్ట్రస్థాయిలో 60 పోలీస్ పోస్టులకు మాలలు, ఆ ఉపకులాలకు ఒక్క పోస్టు రాలేదని గుర్తుచేశారు.  పీజీ,ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఎల్​ఎల్​బీ, పీహెచ్​డీ, ఎంబీ బీఎస్ తదితర అన్నింటిలోనూ అన్యాయం జరుగుతోందని, దాన్ని రివైజ్డ్ చేసి న్యాయం చేయాలని కోరారు.