MLA బాలకృష్ణ కాన్వాయ్ ను అడ్డుకున్న మహిళలు

MLA బాలకృష్ణ కాన్వాయ్ ను అడ్డుకున్న మహిళలు

వెలుగు: ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీయార్ బయోపిక్ సినిమాల్లో బిజీగా గడిపిన బాలకృష్ణ చాలారోజుల తర్వాత అనంతపురం జిల్లాలోని హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో లేపాక్షి మండల కేంద్రంలో బాలకృష్ణ కాన్వాయ్ ను మహిళలు అడ్డుకుని నిరసన తెలిపారు. లేపాక్షిలోని చిన్న చెరువుకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు . దీంతో కారులోంచి దిగివచ్చిన బాలకృష్ణ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఆ తర్వాత ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు .