బోధన్ ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలు పరిష్కరిస్తా : ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి

బోధన్ ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలు పరిష్కరిస్తా : ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి

బోధన్, వెలుగు : బోధన్ ప్రభుత్వ హాస్పిటల్​లోని సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం హాస్పిటల్ వైద్యుల సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడారు.  వార్డులను పరిశీలించి వైద్య సేవలు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. ప్రతినెలా 50వేల మందికి చికిత్సలు అందిస్తున్నామని, 100కు పైగా డెలివరీలు చేస్తున్నట్లు  డాక్టర్లు వివరించారు.  

లైబ్రరీలో కంప్యూటర్ల గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే 

రాకాసిపేట్​లోని లైబ్రరీలోని కంప్యూటర్ గదిని ఎమ్మెల్యే ప్రారంభించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తుందని, నిరుద్యోగులు లైబ్రరీని, కంప్యూటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  

హున్సాలో బుద్ద భవనం ప్రారంభం 

సాలూర మండలంలోని హున్సా గ్రామంలో బుద్ద భవనం, డాక్టర్ అంబేద్కర్, రమాబాయి విగ్రహాలను ఎమ్మెల్యే అవిష్కరించారు.  అనంతరం రైతు వేదిక ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సాసైటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సొసైటీ పాలకవర్గ సభ్యులు కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఉర్దు అకాడమీ చైర్మన్​ తాహెర్​బీన్ హందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డిరాజిరెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ తదితరులు పాల్గొన్నారు.