ఆర్టీసీ బస్టాండ్లు అభివృద్ధి చేయండి.. మంత్రులను కోరిన ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

ఆర్టీసీ బస్టాండ్లు అభివృద్ధి చేయండి.. మంత్రులను కోరిన ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్లను అభివృద్ధి చేయాలని కోరుతూ శుక్రవారం ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్​ వెంకటస్వామిని కలిసి మెమోరాండం అందజేశారు. 

ఆర్మూర్​లో 15 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్​ బస్టాండ్, బస్సు డిపో నిర్మించాలని, నందిపేట్ మండలంలో డిపో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న నందిపేట్ బస్టాండ్​ను ఆధునీకరించాలని, నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించి అదనంగా బస్సు ట్రిప్పులు పెంచాలని వినతిపత్రంలో కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, త్వరలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.