యాదాద్రి, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి విమర్శించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో పార్టీ అధ్యక్షుడు ఉట్కూరు అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. రైతులు, మహిళలు, యువతను మోసం చేశారని తెలిపారు. సెంటర్లకు వచ్చిన వడ్లను కొనుగోలు చేయకుండా రైతులను గోస పెడుతోందని విమర్శించారు.
అకాల వర్షాలు కురిస్తే రైతులకు కలిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని చెప్పారు. ఈ నెల 10న తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి ప్రజలు ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. పాశం భాస్కర్, తాడూరు శ్రీనివాస్, మాయ దశరథ్, దాసరి మల్లేశం, గూడూరు నరోత్తంరెడ్డి, కాదూరి అచ్చయ్య, చందా మహేందర్ గుప్తా ఉన్నారు.
