చేర్యాల, వెలుగు: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. ధూల్మిట్ట, మద్దూరు మండలాల్లోని గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మొదటి విడత ఎన్నికల్లో డబ్బు, మద్యం, బెదిరింపులతోనే కాంగ్రెస్ గెలుపొందినదని ఆరోపించారు.
ప్రభుత్వం హామీలు ఇవ్వడమే తప్ప ఎలాంటి పనులు చేపట్టడం లేదన్నారు. నేడు రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జనగామ, సిద్దిపేట జిల్లాల్లో ప్రజలు పూర్తిగా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారన్నారు. హామీల అమలుకు పోరాడే బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
