ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి

ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి

చేర్యాల, వెలుగు: జనగామ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చేర్యాల, మద్దూర్, ధూల్మిట మండలాల పరిధిలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర  ప్రభుత్వం యూరియా సప్లై చేయడంలో విఫలమైందన్నారు.

 తన ఆస్పత్రికి వచ్చే రోగులకు ఉచిత వైద్యం, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాన్నట్లు వివరించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని మాస్టర్​ ప్లాన్​లో అవకాశం కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాలుగు మండలాల  బీఆర్​ఎస్​పార్టీ నాయకులు పాల్గొన్నారు.