- ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ తాము ప్రతిపక్షమని చెప్పుకుంటున్నప్పటికీ.. ఆదిలాబాద్‌లో మాత్రం బీఆర్ఎస్, -కాంగ్రెస్ కలిసి పనిచేస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్‌శంకర్ మండిపడ్డారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గతంలో బీఆర్ఎస్అధికారంలో ఉన్నప్పుడు రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తమ పార్టీ కార్యాలయాల కోసం ఆక్రమించుకుందని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం అదే కొనసాగిస్తోందని విమర్శించారు. రైతులకు సంబంధించిన విజయ డెయిరీ భూమిని కాంగ్రెస్ కు అప్పగించే ప్రయత్నానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు తెలపడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సమాధానం చెప్పాలన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి రైతుల భూమిని కాపాడాలని కోరారు.
