డబుల్ ​ఇండ్లలో కమీషన్లకు కక్కుర్తిపడ్డ బీఆర్​ఎస్

డబుల్ ​ఇండ్లలో కమీషన్లకు కక్కుర్తిపడ్డ బీఆర్​ఎస్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు :  గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, కమీషన్లకు కక్కుర్తి పడి డబుల్​ బెడ్రూం ఇండ్లను నాసిరకంగా నిర్మించిందని ఆదిలాబాద్​ ఎమ్మెల్యే పాయల్​శంకర్​ విమర్శించారు. పట్టణ శివార్లలో నిర్మించిన డబుల్​ ఇండ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. పేదలకు ఇండ్లు పంపిణీ చేయకముందే సానిటరీ, విద్యుత్ వ్యవస్థ పాడైపోయిందన్నారు. మురుగు నీటి పారేందుకు పైప్​లైన్లు లేవని, తలుపులు, కిటికీలు శిథిలావస్థకు చేరుకున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

అనంతరం కేఆర్​కే  కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఐసీడీఎస్ ​అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై నాణ్యత లేని సరుకులను సరఫరా చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని.. కాంట్రాక్టర్లు, అధికారులపై వెంటనే చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు జోగు రవి, ఆకుల ప్రవీణ్, వేద వ్యాస్, రాజేశ్, సాయి, ముకుంద్, రాజు, గంగుబాయి, స్వప్న, ఆనంద్, రాము తదితరులు ఉన్నారు