ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకం కింద రూ.300 కోట్లతో ఆదిలాబాద్పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆమోదం లభించిందని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. సోమవారం పట్టణంలోని దస్నాపూర్ నుంచి ఇండస్ట్రియల్ ఏరియా వైపునకు నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు.
పట్టణంలో రూ.11 కోట్లతో ప్రస్తుతం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మరో రూ.600 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. మున్సిపాలిటీలో విలీనమైన వివిధ గ్రామాలు, వార్డుల అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్పంచ్‌లుగా గెలిచిన బీజేపీ అభ్యర్థులను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు భరత్, సంతోష్, నగేశ్, జోగు రవి, దాము, భీంసేన్ రెడ్డి, సాయి, శివ, సచిన్, కార్తీక్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
