గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం :  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
  •     ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కరకగూడెం, వెలుగు:  గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ బల పరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 

అభివృద్ధి, పారదర్శక పాలన, గృహ నిర్మాణాలు, శుద్ధి నీటి సదుపాయం రోడ్లు -డ్రైనేజీ లాంటి కీలక సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు డాక్టర్ చందా సంతోష్ కుమార్, మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ , మండల నాయకులు ఎర్ర సురేశ్, కునుసోత్ సాగర్,  కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.