
కామారెడ్డి/నిజామాబాద్: తాను నియోజక వర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశాననిమాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ బాన్సువాడ పట్టణం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు.
తాను తీసుకున్న నిర్ణయం తప్పయితే ఇప్పుడు ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుంటానని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయం తప్పయితే చెప్పుతో కొట్టాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుతోనే ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడే ఉంటానని చెప్పారు.