
- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, నిజాంసాగర్ ప్రాజెక్టు నిండిందని, సరిపడా సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాలరాజ్‌తో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు మంజీరా నదిలోకి వెళ్తుందన్నారు.
కేంద్రం నుంచి యూరియా సరఫరా ఆలస్యం కావడం వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు ఈ.సోలెమాన్, ఏఈ సాకేత్, అక్షయ్, నాయకులు జంగం గందాధర్, ఎజాస్, నార్ల సురేశ్ పాల్గొన్నారు.