మంచిర్యాల నుంచి మేడారం బస్సులు ప్రారంభం

మంచిర్యాల నుంచి మేడారం బస్సులు ప్రారంభం

మంచిర్యాల, వెలుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు మంచిర్యాల నుంచి వెళ్లే స్పెషల్​బస్సులను ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​ రావు ప్రారంభించారు. ఆదివారం జడ్పీ బాయ్స్​హైస్కూల్​గ్రౌండ్​లో ఆర్టీసీ అధికారులతో కలిసి బస్సులకు పూజలు చేశారు. అనంతరం జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. మేడారం జాతర భక్తులకు బస్టాండ్​ పక్కనున్న హైస్కూల్ ​గ్రౌండ్​లో బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.

ఇక్కడి నుంచి మొత్తం 75 బస్సులు నడుపుతున్నామని, రవాణాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నట్లు చెప్పారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ఈ నెల 21 నుంచి 24 వరకు గోదావరి తీరంలో జరగనున్న జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలిం చారు. త్వరగా ఏర్పాటు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆదిలాబాద్ ​నుంచి 65 బస్సులు

ఆదిలాబాద్: మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆదిలాబాద్ డిపో మేనేజర్ కల్పన ఓ ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ డిపో నుంచి 65 ఆర్టీసీ బస్సులు చెన్నూర్ పాయింట్​కు వెళ్తాయని, అక్కడి నుంచి మేడారానికి తరలిస్తామని, ఫుల్ టికెట్ రూ. 420 , ఆఫ్ టికెట్ రూ.230 అని పేర్కొన్నారు. సమ్మక–సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ కార్గో ద్వారా బంగారం ప్రసాదం హోం డెలివరీ చేయనున్నామని, ఇందుకోసం రూ. 299 ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.