ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఆయన..సిద్దిపేట జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా హకీంపేట ఎయిర్ పోర్స్ స్టేషన్ దగ్గర పోలీసులు రఘునందన్ రావును అరెస్ట్ చేసి..అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 

జులై 05వ తేదీన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. అయితే జులై 04వ తేదీ మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణలు జరగడంతో అక్కడకు బయలుదేరారు. గజ్వెల్లోని బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు..ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు.