ప్రతి ఒక్కరూ శివాజీ చరిత్ర తెలుసుకోవాలి: రాజాసింగ్

 ప్రతి ఒక్కరూ శివాజీ చరిత్ర తెలుసుకోవాలి: రాజాసింగ్

యువత శివాజీ ఆశయాలు కొనసాగించాలని..ఆయన గురించి తెలుసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. మెదక్ లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. హిందువుగా పుట్టి.. హిందువుగా పెరుగుతున్నాం కాబట్టి శివాజీ గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాలన్నారు. విద్యార్థులకు శివాజీ, భగత్ సింగ్ ల గురించి చెప్పడం లేదని.. వారి చరిత్రను వివరించాలని సూచించారు. చిన్నతనంలోనే శివాజీ గోరక్షణ చేశారని..ప్రతి హిందువు గోసేవా, గోరక్షణ చేయాలని కోరారు.

చత్రపతి శివాజీ 300 లకు పైగా యుద్ధాలు చేశారని రాజాసింగ్ గుర్తు చేశారు. పూర్వం అఫ్జల్ ఖాన్ అనే రాజు అనేక హిందూ దేవాలయాలు కూలగొట్టాడు.. అఫ్జల్ ఖాన్ ను శివాజీ మట్టుపెట్టి దేవాలయాల రక్షంచారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శివాజీ చరిత్ర తెలుసుకోవాలని..భారత దేశం హిందూ దేశం కావాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో భారత్ హిందూ దేశం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ  హిందువు,యువకుడు శివాజీ లాగా తయారు కావాలని తెలిపారు. చిన్న పిల్లలకు శివాజీ,భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ ల చరిత్ర చెప్పాలని సూచించారు.  రెండు నెలల్లో పలు చోట్ల 23 శివాజీ విగ్రహాలు ఆవిష్కరించామని అన్నారు.