నేనే సీఎం అని ప్రకటించుకోవటం.. కాంగ్రెస్ పార్టీ విధానం కాదు : రాజగోపాల్ రెడ్డి

నేనే సీఎం అని ప్రకటించుకోవటం.. కాంగ్రెస్ పార్టీ విధానం కాదు : రాజగోపాల్ రెడ్డి

 

పదేళ్లు తానే సీఎం అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ విధానాలకు వ్యతిరేకమని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 

 రేవంత్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే.?.. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి  ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. 

ఈ పాలమూరు బిడ్డనే సీఎం

జులై 18న  నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్​ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్​ ఇండియా రెసిడెన్షియల్​ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ ​రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం  ప్రజాపాలన -ప్రగతిబాట’ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.   2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. నీ గుండెల మీద, నీ కొడుకు గుండెల మీద రాసిపెట్టుకో కేసీఆర్.. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటది. ఈ పాలమూరు బిడ్డనే సీఎంగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. నా కోరిక ఒక్కటే.. కేసీఆర్ అసెంబ్లీ రావాలె. అపోజిషన్‌‌లో ఆయన కూర్చోవాలే. మేం చేసే మంచి పనులు చెబుతుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడ్వాలె. అందుకే నిన్ను అసెంబ్లీకి రమ్మంటున్నా. అసెంబ్లీకి వస్తే నువ్వు చేసిన ద్రోహం, అన్యాయం ఏంటో తెలుస్తది’’ అంటూ కేసీఆర్‌‌‌‌పై రేవంత్ విరుచుకుపడ్డారు.