కేంద్రం నిధులను టీఆర్‌‌‌‌ఎస్ దుర్వినియోగం చేస్తోంది

కేంద్రం నిధులను టీఆర్‌‌‌‌ఎస్ దుర్వినియోగం చేస్తోంది

హైదరాబాద్, వెలుగు: పాత వరద లెక్కల వివరాలు అడిగిన తర్వాతే తెలంగాణకు వరద సాయం చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. అప్పట్లో కేంద్రం ఇచ్చిన నిధులను టీఆర్‌‌‌‌ఎస్​ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. గతంలో విపత్తు సాయం కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.3 వేల కోట్లు ఇచ్చిందని, వాటిని దేని కోసం ఖర్చు చేశారో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలన్నారు.

అలాగే, ఇటీవల వరదలకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్ వరద సాయం కోసమే ఢిల్లీ వెళ్లారని చెప్పారు. ఈటల రాజేందర్​తో పాటు బీజేపీ లీడర్లపై టీఆర్​ఎస్​ చేస్తున్న విమర్శలను ప్రకటనలో తిప్పికొట్టారు. ఈటల గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ లీడర్లకు లేదని పేర్కొన్నారు. రాజేందర్​ను హుజురాబాద్ ప్రజలు ఆమోదించారనే విషయం  గుర్తు పెట్టుకోవాలని సూచించారు.