
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ చట్టంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చర్చలో మాట్లాడే అవకాశం వచ్చాక రాజాసింగ్.. హైదరాబాద్ నగర రోడ్ల దుస్థితిని ప్రస్తావించారు. కమిషనర్‌కు రిప్రజెంటేషన్ ఇచ్చినా స్పందించడం లేదని అన్నారు. దీనిపై సీఎం.. ఇలాంటి సమస్యలు ఉంటే ఎనీ టైమ్ నాకే రిప్రజెంటేషన్ ఇవ్వండన్నారు. దీంతో రాజాసింగ్ స్పందిస్తూ.. ‘‘సీఎంను కలవడం ఎట్లా? అసలు ఆయన్ను కలవడానికి ముందు ఎవరిని కలవాలె, కాంటాక్ట్ నంబర్ ఏది?’ అని అన్నారు. దీనిపై స్పందించిన సీఎం తనను కలవడానికి ఓ పద్ధతి ఉందని, అపాయింట్‌మెంట్ తీసుకుని కలవొచ్చని అన్నారు.