గుడుంబా దందా ఆపినోళ్లకు.. డబుల్ ఇల్లు ఇయ్యాలె : రాజాసింగ్

గుడుంబా దందా ఆపినోళ్లకు.. డబుల్ ఇల్లు ఇయ్యాలె : రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు :  ధూల్ పేటలో గతంలో గుడుంబా అమ్ముకునే వాళ్లను పట్టుకొని ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు పంపిందని, దీంతో ఆ కుటుంబాలకు జీవనాధారం లేకుండా పోయిందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆదివారం ధూల్ పేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేస్తున్నందున వాటిని గుడుంబా అమ్మకాన్ని బంద్ చేసిన వారికి ఇవ్వాలని శనివారం  ప్రకటనలో  కోరారు.  

ఈ అంశాన్ని గతంలో కూడా అసెంబ్లీలో ప్రస్తావించానని ఆయన గుర్తు చేశారు.  పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్లకు డబుల్ బెడ్ రూమ్  ఇళ్లు  ఇచ్చేవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టనని రాజసింగ్ పేర్కొన్నారు.