జీహెచ్ఎంసీ ఫండ్స్ ఏమైనయ్​?..ఎమ్మెల్యే రాజాసింగ్

జీహెచ్ఎంసీ ఫండ్స్ ఏమైనయ్​?..ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రూ.వెయ్యి కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉందని, ఇంకా కొత్త పనులు చేయమని ప్రభుత్వం వారిని ఎలా అడుగుతుందని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో ఉన్న ఫండ్స్ ఏమయ్యాయని నిలదీశారు. ఆ ఫండ్స్​ను మీ సొంతానికి వాడుకున్నరా? అని కేసీఆర్, కేటీఆర్​ను ప్రశ్నించారు. అభివృద్ధి పనులు జరుగుతలేవు కాబట్టి  ఎన్నికలకు మరో 6 నెలలు టైమ్ కావాలని ఎలక్షన్ కమిషన్​కు లేఖ రాయాలని సూచించారు.