
హైదరాబాద్, వెలుగు: ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ అశాంతిని సృష్టించేలా వ్యవహరించారని, ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ లో మునావర్ ఫారూకీ చౌకబారు కామెడీ షో నిర్వహణ వెనక ఉన్న కేటీఆర్ పై పోలీసు అధికారులు వెంటనే పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. కేటీఆర్ వల్లే ఎమ్మెల్యే రాజాసింగ్ జైలులో ఉన్నారని ఆరోపించారు.
ఎంఐఎం, ముస్లిం ఓటర్లను బుజ్జగించడం కోసమే హిందూ దేవుళ్లను అవమానించిన ఫారూకీతో కేటీఆర్ షో చేయించారని ఆమె ఆరోపించారు.