బాసర ఆలయ అభివృద్ధికి కృషి చేయండి

బాసర ఆలయ అభివృద్ధికి కృషి చేయండి
  • మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే రామారావు పటేల్​ విజ్ఞప్తి

భైంసా, వెలుగు:  బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే రామారావు పటేల్​ విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్​లో మంత్రిని ఎమ్మెల్యే పటేల్​కలిశారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఈ ఆలయానికి రూ.50 కోట్ల నిధులను విడుదల చేసిందని, కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులను వెనక్కి తీసుకుందన్నారు. 

మళ్లీ యథావిధిగా ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రసాద్​ స్కీం ద్వారా వచ్చేలా చూడాలని మంత్రికి విన్నవించారు. అనంతరం ముథోల్​ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి వర్క్​ఆర్డర్​ ఇవ్వాలని కమిషనర్​ను మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.