రేషన్ బియ్యంలో కేంద్రం వాటానే ఎక్కువ : ఎమ్మెల్యే రామారావు పటేల్

రేషన్ బియ్యంలో కేంద్రం వాటానే ఎక్కువ : ఎమ్మెల్యే రామారావు పటేల్

భైంసా, వెలుగు: ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే అధిక వాటా అని ముథోల్​ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బుధవారం భైంసాలోని ఓ ఫంక్షన్​ హాల్​లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిలో రేషన్ బియ్యానికి కేంద్ర ప్రభుత్వం రూ.40 ఇస్తోందన్నారు. గత పాలకులు పదేండ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పేదలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం అభినందనీయమన్నారు. కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని తెలపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి

కుంటాల, వెలుగు: నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. కుంటాల మండలం అంబకంటిలో శివ పరివార స్థిర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీపీ ఆప్క గజ్జరాం, బీజేపీ మండల అధ్యక్షుడు పసుల నవీన్, నాయకులు వెంగల్ రావు, దేవిదాస్, లింగదాస్, శివ, గంగయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.