
సీఎం కేసీఆర్‌లో గాంధీ, సేవాలాల్‌ను చూసుకుంటున్నామన్నారు ఎమ్మెల్యే రేఖా నాయక్. గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యం నేడు పల్లెల్లో కనిపిస్తోందన్నారు. కేసీఆర్ వల్లే తండాలు అభివృద్ధి చెందుతాయని.. గాంధీజీ, సేవాలాల్ ఆశయాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. గాంధీ, సేవాలాల్ మాదిరిగా సీఎం కేసీఆర్ కనిపిస్తున్నారన్న ఆమె.. గిరిజన తండాలు, గూడెలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇప్పుడు అధికారులు తండాలకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నారని.. పల్లె ప్రగతి కార్యక్రమంతో తండాల్లో సీజనల్ వ్యాధులు పూర్తిగా నివారించగలిగామని తెలిపారు. గత ప్రభుత్వాలు ఆడబిడ్డలు నీళ్ల కోసం పడుతున్న కష్టాలను పట్టించుకోలేదని..ఇప్పుడు సీఎం కేసీఆర్ తండాలకు కూడా మిషన్ భగీరథ కింద సురక్షితమైన తాగునీరును సరఫరా చేస్తున్నారన్నారు. తండాలకు, గూడేలకు త్రీ ఫేజ్ కరెంట్ అందించడం గొప్ప విషయమని చెప్పారు.