
ఏపీ శాసన మండలి రద్దు నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. వ్యవస్థలను బ్రస్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే అయనకు స్టీరింగ్ యనమల రామకృష్ణుడన్నారు. పెద్దల సభ సలహాలు ఇచ్చే విధంగా వుండాలి కానీ వివాదం సృష్టించే విధంగా ఉండకూడదన్నారు. పెద్దల సభ అంటే పెద్దలను సభకు పంపించాలని కానీ దద్దమ్మలను తద్దొజనాలను పంపించరాదన్నారు.
151 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి పంపించితే శాసన మండలి లో ఆలస్యం చేయటం సరికాదన్నారు. దమ్ముంటే శాసనమండలిని రద్దు చేయమని లోకేష్ సవాల్ విసరడం.. బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్లు ఉందన్నారు. కోసి ఉప్పు కారం పూసి కూర వండుకుంటారన్నారు రోజా.
see more news
‘29న ప్రకాశ్ రాజ్, కుమారస్వామిని చంపేస్తాం‘