
ప్రగతి భవన్ : సీఎం కేసీఆర్ ను హైదరాబాద్ ప్రగతి భవన్ లో కలిశారు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు.. నాగార్జున్ సాగర్ ఎడమ కాల్వ నుంచి నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే సండ్ర సీఎంను రిక్వెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి వెంటనే నీరు విడుదల చేయాలంటూ ఆదేశించారు.
సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మెట్ట, ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారని చెప్పారు సండ్ర. ఆ పంటలకు ప్రస్తుతం నీరు అవసరమని, పదిరోజుల పాటు నాగార్జున సాగర్ ఎడమకాల్వ నుంచి నీరు అందించి, పంటలను కాపాడాలని సీఎం కోరుతూ.. వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన కేసీఆర్ నీటి విడుదలకు అంగీకరించారు.