జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 40వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.62.5 కోట్లు మంజూరు చేశారన్నారు.
పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని కొందరు అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. గతంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు రాకపోవడంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు. కార్యక్రమంలో ఏఈ శరణ్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, శ్రీనివాస్, శివకేసరిబాబు, అనిల్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
