నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

నారాయణ్ ఖేడ్, వెలుగు : అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్​ సర్కార్​కు రెండు కండ్లని  ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. గురువారం ఖేడ్ పట్టణ శివారులోని ఆడిటోరియంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందినవారికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ 161 చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.

కాంగ్రెస్​ హయాంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.  కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.