ఇండోర్, ఔట్​డోర్​ స్టేడియాలు నిర్మిస్తాం ఎమ్మెల్యే సంజీవరెడ్డి

ఇండోర్, ఔట్​డోర్​ స్టేడియాలు నిర్మిస్తాం ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఖేడ్‌లో ఇండోర్, ఔట్‌డోర్‌ స్టేడియాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. జిల్లా స్పోర్ట్స్, అండ్‌ యూత్‌ అధికారి ఖాసీంబేగ్, ఆర్డీవో అశోక చక్రవర్తి, తహసీల్దార్‌ భాస్కర్, జిల్లా స్పోర్ట్స్‌ అధికారులు హబీబ్, పవన్, కల్యాణ్, వపన్‌ కుమార్‌తో కలిసి గురువారం స్థల పరిశీలన చేశారు.

పట్టణంలోని తహసీల్‌ గ్రౌండ్‌లో ఇండోర్‌, జూకల్‌ శివారులోని డిగ్రీ కాలేజ్​వెనుక ఔట్‌డోర్‌ స్టేడియం కోసం స్థలాలను పరిశీలించారు. ఔట్‌డోర్‌ స్టేడియం కోసం 5.20ఎకరాలు, ఇండోర్‌ కోసం 5 ఎకరాలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్, ఇంజనీర్‌ కృష్ణమూర్తి పాల్గొన్నారు. అనంతరం క్యాంపు ఆఫీసులో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రఘువీర్, ఈఈ పాష, గ్రిడ్‌ డిప్యూటీ ఈఈ అరవింద్, ఏఈ రవికుమార్, ఆర్‌డబ్ల్యూఎస్‌ డిప్యూటీ ఈఈ ఫణివర్మలతో సమీక్ష నిర్వహించారు.

మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా వేసిన కొన్ని పైప్‌లైన్లు తక్కువ నీటిసామర్థ్యం ఉండడం వల్ల చాలా గ్రామాలకు నీరు వెళ్లడం లేదని అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు.గూడురు, బోరంచ ఫిల్టర్‌ బెడ్‌ల కరెంటు సమస్య పరిష్కారం కోసం ట్రాన్స్​కో ఎస్‌ఈతో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్నారు. అనంతరం తాగునీటి కోసం రూ.80 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు.