రేవంత్ వస్తుండని పోడు భూములకు పట్టాలిస్తమంటున్రు : సీతక్క

రేవంత్ వస్తుండని పోడు భూములకు పట్టాలిస్తమంటున్రు : సీతక్క

మేడారం వనదేవతల ఆలయం నుంచి రేవంత్ రెడ్డి యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా పస్రాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. ఒక్క పిలుపుతో ఇంత మంది తరలిరావడం చూస్తుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేవరకు రేవంత్ అడుగులో అడుగేయాలని పిలుపునిచ్చారు. తాను పేదింటి బిడ్డనైనా అక్కున చేర్చుకున్నారని.. మూడు తరాలతో అక్కా అని అప్యాయంగా పిలిపించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి వస్తున్నాడని తెలిసి పోడు భూములకు పట్టాలు ఇస్తామని రాత్రికి రాత్రి చాటింపు వేశారన్నారు. కాంగ్రెస్ అంటేనే లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన పార్టీ అని అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.