రూ. 40కి దొరికే పెట్రోల్‌ మీద రూ. 65 పెంచారు

రూ. 40కి దొరికే పెట్రోల్‌ మీద రూ. 65 పెంచారు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ‘చలో రాజ్‌భవన్’ తలపెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దాంతో ఎమ్మెల్యే సీతక్క ధర్నాచౌక్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

‘కాంగ్రెస్ పార్టీ హయాంలో అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే బీజేపీ గగ్గోలు పెట్టింది. మరి ఇప్పుడు అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువగా ఉంటే.. మోడీ ప్రభుత్వం మాత్రం అధిక ధరలు వసూలు చేస్తోంది. రూ. 40లకు దొరికే పెట్రోల్‌కు 65 రూపాయలు అదనంగా పెంచి అమ్ముతున్నారు. కరోనా పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచింది. పెరిగిన ధరలు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పెరిగిన ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ రాజ్‌భవన్‌కు పిలుపు ఇస్తే అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం’ అని సీతక్క అన్నారు.