యూరియా కోసం రోడ్డుపై బైఠాయించిన సీతక్క

యూరియా కోసం రోడ్డుపై బైఠాయించిన సీతక్క

ములుగు జిల్లా: రైతుబందు, రైతుభీమా రాని అన్నదాతలకు తక్షణమే వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సీతక్క. రైతులపై టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు.

మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్న సితక్క.. ఏటూరు నాగారం వై జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి..రైతులకు యూరియా కొరతను నివారించాలని డిమాండ్  చేశారు.