పద్మారావునగర్, వెలుగు: ఐస్ స్కేటింగ్‌లో జాతీయ స్థాయికి ఎంపికై సత్తా చాటిన అన్న నగర్ ప్రాంతానికి చెందిన మాస్టర్ సాత్విక్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అభినందించారు. డెహ్రాడూన్ వేదికగా ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో సాత్విక్ రెండు స్వర్ణ పతకాలను కైవసం చేసుకొని, జాతీయ స్థాయికి అర్హత సాధించాడు.
శుక్రవారం తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన సాత్విక్‌ను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. సాత్విక్ సాధించిన విజయం నియోజకవర్గానికే గర్వకారణమని, భవిష్యత్తులో అతను అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
సాత్విక్‌కు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, మెరుగైన శిక్షణ కోసం వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
