- ఎమ్మెల్యే శ్రీగణేశ్ దీక్షకు సంఘీభావం
పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీగణేశ్ చేపట్టిన రిలే నిరహార దీక్షకు మాజీ మంత్రి గీతారెడ్డి ఆదివారం సంఘీభావం తెలిపారు. కంటోన్మెంట్ విలీన పోరాటం మరో స్వతంత్ర ఉద్యమం లాంటిదన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ప్రజలు చెల్లించిన రూ.1200 కోట్ల సర్వీస్ చార్జీలను కేంద్రం విడుదల చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. నామినేటెడ్ వ్యవస్థ ద్వారా రాచరిక పాలన కొనసాగించడం సరికాదన్నారు. కంటోన్మెంట్ ప్రజల ఆకాంక్ష మేరకు బోర్డు విలీనం చేయాలన్నారు.
