
నవీపేట్, వెలుగు : అక్రమాలకు తావులేకుండా అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నాడపూర్, జన్నెపల్లి, సిరన్ పల్లి, నవీపేట్, నాగేపూర్, మద్దేపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పేదలను పట్టించుకోలేదన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వడం లేదన్నారు.
ఎమ్మెల్యే వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ రాజేందర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ బాలరాజ్ గౌడ్, మాజీ చైర్మన్ కిషన్ రావు, సొసైటీ డైరెక్టర్లు బేగరి సాయిలు, ధర్మాజీ, కాంగ్రెస్ నాయకులు ఎస్కే బాబు, ఈశ్వర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్, చేపూర్లో ..
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్ తో పాటు మండలంలోని చేపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులు మంజూరు పత్రాలు అందుకుని, ఇంటి నిర్మాణానికి ముగ్గు వేశారు. ఆర్మూర్ టౌన్ లోని జిరాయత్ నగర్ 1వ, 14వ వార్డులో ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్ , చేపూర్లో ఎంపీడీవో బ్రహ్మానందం, మున్సిపల్ కమిషనర్ రాజు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేసి, ఇంటి నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్స్ నాగరాజు, శివ, వీణ, కాంగ్రెస్ ఆర్మూర్ మండల ప్రెసిడెంట్ సురకంటి చిన్నారెడ్డి
పాల్గొన్నారు.