పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ..మట్టి వినాయకుడిని పూజించాలి : ఎమ్మెల్యే సునీతారెడ్డి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ..మట్టి వినాయకుడిని పూజించాలి : ఎమ్మెల్యే సునీతారెడ్డి

 వెలుగు, నెట్​వర్క్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మండల పరిధిలోని దొంతి గ్రామస్తులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. మెదక్​కలెక్టరేట్ లో కలెక్టర్​రాహుల్​రాజ్​పాత్రికేయులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. హవేలీ ఘనపూర్​మండల కేంద్రంలోని బీసీ గురుకుల విద్యార్థులు ఎకో ఫ్రెండ్లీ గణేశుడిని తయారచేసి కలెక్టర్​రాహుల్​రాజ్​, అడిషనల్​కలెక్టర్​నగేశ్​కు అందించారు. 

చిన్నశంకరంపేట మండలం చందాపూర్ పైమరీ స్కూల్​లో విద్యార్థులు మట్టి వినాయకులను తయారు చేసి పూజలు చేశారు. వినాయకుల మాస్కులను పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. రాయికోడ్ మండలంలోని సింగీతం హై స్కూల్ స్టూడెంట్స్​మట్టి వినాయకులను తయారుచేసి పంపిణీ చేశారు. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ గుప్తా, ప్రధాన కార్యదర్శి పుల్లూరు ప్రకాశ్ ఆధ్వర్యంలో  నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి మట్టి వినాయకులను పంపిణీ చేశారు.