గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి : ఎమ్మెల్యే సునీతా రెడ్డి

గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి : ఎమ్మెల్యే సునీతా రెడ్డి

నర్సాపూర్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీవో ఆఫీసులో నియోజకవర్గంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలపై వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా, కరెంట్ సమస్య లేకుండా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎంపీడీవో మధులత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.