సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

పిట్లం, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పిట్లంలో కాంగ్రెస్ అభ్యర్థి కుమ్మరి శేఖర్ నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.  ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్​ పార్టీకి ఉందని, శేఖర్​ గెలవడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో  మెజార్టీ స్థానాలకు దక్కించుకునేలా పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.

  కార్యకర్తలు, లీడర్లు కాంగ్రెస్ సర్కార్​ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుందని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన వివరాలను గడపగడపకు వెళ్లి తెలుపాలన్నారు. గతంలో బీఆర్ఎస్​, బీజేపీ ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకున్నాయే తప్పా పల్లెలను అభివృద్ధి చేయలేదన్నారు. ర్యాలీగా వెళ్లి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.