
- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి/ పెబ్బేరు/గోపాల్ పేట/రేవల్లి/ఏదుల , వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టిపెట్టిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దమందడి, పెబ్బేరు, శ్రీరంగాపూర్, గోపాల్పేట మండల కేంద్రాల్లో ఆయన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో పునర్ నిర్మించిన డీసీసీబీ భవనాన్ని ఉమ్మడి డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.