అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
  •     ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పెబ్బేరు, వెలుగు : అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం పెబ్బేరు మున్సిపాలిటీ 11వ వార్డులోని నాగులకుంటలో అమృత్ స్కీం 2.0 ద్వారా రూ.3.14 కోట్లతో చేపట్టిన పునర్జీవ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న పెబ్బేరు పట్టణంలోని నాగులకుంట అభివృద్ధి చేస్తామన్నారు. కుంట పూర్తిగా స్వచ్ఛమైన నీటితో నిండటమే కాకుండా శోభాయమానంగా మారనుందన్నారు. 

పెద్దగూడెంలో జీపీ భవనం ప్రారంభం..

వనపర్తి, వెలుగు : మండలంలోని పెద్దగూడెం తండాలో గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు పనిచేయాలని సర్పంచ్​ వాల్యానాయక్​కు సూచించారు. అనంతరం మండలంలోని మెంటేపల్లి గ్రామంలో నూతన అంగన్​వాడీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.